న్యూఢిల్లీ: మాజీ కేంద్రమాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావు..సోనియా గాంధీని గురువారం కలిసి పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ ఉదయం సోనియా స్వయంగా దాసరికి ఫోన్ చేసి 10 జన్ పథ్ కు ఆహ్వానించారు. 10.45 గంటలకు సోనియాతో దాసరి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పీఆర్పీ గురించి చర్చలు జరిగినట్లు సమాచారం. దాసరి కూడా చిరంజీవి సామాజిక వర్గానికే చెందడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే సోనియాతో భేటీ అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పీఆర్పీ మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.