కొలంబో: తమిళ టైగర్ వేలుపిళ్లై ప్రభాకరన్ 24 ఏళ్ల కుమారుడు చార్లెస్ ఆంటోనీ మరణించి ఉంటాడని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. భద్రతా బలగాలు స్వాధినం చేసుకున్న ఒక శవం తమిళ టైగర్ ప్రభాకరన్ కొడుకు చార్లెస్ ఆంటోనీది అయి ఉంటుందని ఒక ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభాకరన్ గురించి మాత్రం సమాచారం తెలియడం లేదు. తమిళ టైగర్లు తమ ఓటమిని అంగీకరించిన నేపథ్యంలో ప్రభాకరన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే వార్తలు కూడా వచ్చాయి.