ముఖ్యమంత్రిగా వైయస్ ప్రమాణం

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారం సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియంలో అశేష జనవాహిని ముందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ ఎన్డీ తివారీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) తమ నేతగా వైయస్ రాజశేఖర రెడ్డిని లాంఛనగా ఎన్నుకుంది. తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా సిఎల్పీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేసింది. 294 సభ్యుల సంఖ్య గల శాసనసభలో కాంగ్రెస్ పార్టీ 257 సీట్లను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. దీంతో రాజశేఖర రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రిగా గతంలో ప్రమాణం చేసినప్పుడు ఉచిత విద్యుత్‌ పై సంతకం చేసిన వై.ఎస్‌ ఈసారి ప్రమాణస్వీకారం అనంతరం రెండు ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాను 7నుంచి 9 గంటలకు పెంచుతూ ఓ ఫైలుపై, సబ్సిడీ బియ్యం కుటుంబానికి 25 నుంచి 30 కిలోలకు పెంచుతూ మరో ఫైలుపై ఆయన సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.

రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారానికి హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ప్రధాన కూడళ్లను కాంగ్రెసు కార్యకర్తలు అలంకరించారు. వైయస్ ప్రమాణ స్వీకారోత్సవానికి లక్ష మందికి పైగా హాజరు కావచ్చునని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపలేదు. ఎవరైనా హాజరు కావచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+