హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితకు హోం: రోశయ్యకు ఆర్థికం

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మంత్రులకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాఖలను కేటాయించారు. ఆశ్చర్యకరంగా సబితా ఇంద్రారెడ్డికి హోం శాఖను ఇచ్చారు. ఒక మహిళా మంత్రి హోంశాఖను నిర్వహించడం బహుశా ఇదే ప్రథమం. హోంశాఖను తెలంగాణ మంత్రికి కేటాయించడం సర్వసాధారణంగా వస్తోంది. అయితే కోస్తా ప్రాంతానికి చెందిన కొంత మంది, రాయలసీమకు చెందిన మైసురా రెడ్డి హోంశాఖను నిర్వహించిన సందర్భాలున్నాయి. అయితే తెలంగాణకు హోం శాఖను అప్పగించడం మామూలే అనుకున్నా మహిళకు అప్పగించడం ఆశ్చర్యకరమే.

చాలా మంది సీనియర్ మంత్రులకు పాత శాఖలనే కేటాయించారు. రోశయ్య ఆర్థిక శాఖను, పొన్నాల లక్ష్మయ్యకు భారీ నీటి పారుదలను, ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూను, రఘువీరా రెడ్డికి వ్యవసాయాన్ని మళ్లీ కేటాయించారు. గతంలో జెసి దివాకర్ రెడ్డి నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖను బొత్సా సత్యనారాయణకు కేటాయించారు. మహిళా మంత్రులకు ముఖ్యమైన శాఖలను కేటాయించారు.

రోశయ్య - ఆర్థిక, శాసనసభా వ్యవహారాలు
బాలినేని శ్రీనివాసరెడ్డి - గనులు
కన్నా లక్ష్మీ నారాయణ - భారీ పరిశ్రమలు
గాదె వెంకటరెడ్డి - దేవాదాయ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు
మోపినేని వెంకటరమణ - సాంకేతిక విద్య
మాణిక్య వర ప్రసాద్‌ - ప్రాథమిక విద్య
ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ
శత్రుచర్ల విజయరామరాజు - రవాణా
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ - సాంఘిక సంక్షేమం
విశ్వరూప్‌ - గ్రామీణ నీటి సరఫరా
వట్టి వసంతకుమార్‌ - గ్రామీణాభివృద్ధి
బొత్స సత్యనారాయణ - పంచాయతీరాజ్
ఆనం రాంనారాయణరెడ్డి - మున్సిపల్ వ్యవహారాలు
సబితా ఇంద్రారెడ్డి - హోం
అహ్మదుల్లా - మైనారిటీ సంక్షేమం
రఘువీరారెడ్డి - వ్యవసాయం
శిల్పా మోహన్ రెడ్డి - గృహ నిర్మాణం
పార్థసారధి - పశు సంవర్ధక
ముఖేష్‌గౌడ్‌ - బిసి సంక్షేమం
దానం నాగేందర్‌ - వైద్యం, ఆరోగ్యం
గల్లా అరుణకుమారి - రోడ్లు, భవనాలు
పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి - అటవీశాఖ
డీకే అరుణ - లఘు పరిశ్రమలు
జూపల్లి కృష్ణారావు - పౌర సరఫరాలు
పసుపులేటి బాలరాజు - గిరిజన సంక్షేమం
శ్రీధర్‌ బాబు - ఉన్నత విద్య
సునీతా లక్ష్మారెడ్డి - మైనర్ ఇర్రిగేషన్
గీతారెడ్డి - సమాచారం, టూరిజం
దామోదర రాజనర్సింహ - మార్కెటింగ్
సుదర్శన్‌రెడ్డి - వైద్య విద్య
పొన్నాల లక్ష్మయ్య - భారీ నీటిపారుదల
కొండా సురేఖ - మహిళా శిశు సంక్షేమం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఐటి
రాంరెడ్డి వెంకటరెడ్డి - సహకారం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X