నల్లగొండ: అమెరికాలోని సెయింట్ లూయిస్ ప్రాంతంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన టేకుల శ్రీధర్ రెడ్డి(27) ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందారు. తన స్నేహితులతో కలిసి నదిలో ఈత కోసం వెళ్లిన శ్రీధర్ రెడ్డి అలల తాకిడితో నీటిలో మునిగి చనిపోయినట్లు ఉరుమడ్లలోని అతని కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం సమాచారం అందింది.
శ్రీధర్ రెడ్డి ఆరేళ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. శ్రీధర్ తండ్రి శ్రీనివాసరెడ్డి విద్యుదాఘాతంతో చిన్నతనంలోనే మృతి చెందారు. తల్లి ప్రమీల ఆయనను పెంచి పెద్దచేసింది.