కోర్టు ఆవరణలో సాక్షి హత్య
నిజామాబాద్: హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని కోర్టు ఆవరణలోనే ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం నిజామాబాద్ లో జరిగింది. అక్రమ్ అనే వ్యక్తి ఓ హత్యకేసులో సాక్ష్యం చెప్పేందుకుగాను నిజామాబాద్ జిల్లా కోర్టుకు వచ్చాడు. కోర్టు ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడిచేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. దీంతో అక్కడివారు కకావికలయ్యారు. పోలీసులు తేరుకుని వారిలో 5గురిని అరెస్టు చేశారు. మరికొంతమంది పారిపోయారు. హతుడు అక్రమ్ రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసులో బాధితులే కక్షతో ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications