లంక మృతుల సంఖ్య తెలియదు: యుఎన్
ఐక్యరాజ్యసమితి: శ్రీలంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంపై సైన్యం సాగించిన పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచానికి తెలియదని సమితి ప్రతినిధి జాన్ హోమ్స్ చెప్పారు. అది ప్రపంచానికి ఎప్పుడు కూడా తెలియకపోవచ్చునని అన్నారు. ఈ పోరులో సైన్యం ఉపయోగించిన భారీ శతఘ్నులతో దాదాపు 20 వేలమందికి పైగా చనిపోయివుండవచ్చని ప్రఖ్యాత టైమ్స్ పత్రిక కథనంపై స్పందిస్తూ ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని లేదా తక్కువగా వుండవచ్చని ఆయన వెల్లడించారు.
వార్తా కథనం సంఖ్యతో ఆయన విభేదించారు. అయితే ఏప్రిల్ వరకు ఏడువేలమందికి పైగా మరణించారని ఆయన తెలిపారు. అయితే చివరి దశ పోరులో వేలాదిమంది హతులయ్యారని అయితే వారి సంఖ్యపై ఐరాస వద్ద సమాచారం లేదని ప్రతినిధి పేర్కొన్నారు. తుది పోరు సమయంలో మరణాలు విపరీతంగా సంభవించాయని అన్నారు.












Click it and Unblock the Notifications