హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు అసెంబ్లీకి వచ్చిన ఆయనకు అసెంబ్లీలో మంత్రులు రఘువీరా, పొన్నాల, శ్రీధర్ బాబు, ముఖేష్ గౌడ్ లు స్వాగతం పలికారు. అనంతరం సభలోకి వచ్చిన వెంటనే స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రొటెం స్పీకర్ జేసీ దివాకర్ రెడ్డి కోరారు. దీంతో ఆయన వివిధ పార్టీల నాయకుల మధ్య స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.