సిటీలో భద్రత కట్టుదిట్టం: ప్రసాదరావు
హైదరాబాద్: ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. భద్రతపై తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం అసెంబ్లీ హాల్‌లో కలిసి వివరించారు. అసెంబ్లీ భద్రతను పెంచడంతోపాటు ప్రముఖులు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద నిఘాను పెంచినట్లు తెలిపారు. దీంతోపాలు నగరంలో రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో తనిఖీలు పెంచినట్లు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారని, అయితే ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని ఆమె ప్రజలను కోరారు. ఉగ్రవాదాన్ని అరికట్టే ఆక్టోపస్ ను మరింత పటిష్టం చేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications