కెసిఆర్ కు సన్ స్ట్రోక్: ఆగని లొల్లి
హైదరబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు తనయుడు కెటి రామారావు లక్ష్యంగా ఆ పార్టీలో అసమ్మతి ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైఫల్యానికి కారణాలేమిటో, ఎవరు దానికి కారణమో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో తేల్చాలని ఆ పార్టీ అసమ్మతి నాయకుడు ఎ.చంద్రశేఖర్ డిమాండ్ చేస్తున్నారు. కెటి రామారావు పెత్తనం వల్లనే పార్టీ నష్టపోయిందనేది పార్టీ అసమ్మతి వాదుల అభిమతంగా కనిపిస్తోంది. దాదాపు 30 మంది అసమ్మతి వాదులు శుక్రవారం రహస్య సమాలోచనలు జరిపారు. తిరిగి శనివారం కూడా వారు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో రవీంద్రనాయక్, విజయరామారావు, కెకె మహేందర్ రెడ్డి, చంద్రశేఖర్ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. కెసిఆర్ కు వీరంతా గతంలో వెన్నుదన్నుగా నిలిచినవారే.
శుక్రవారంనాటి సమావేశంలో దాదాపు 30 మంది నాయకులు పాల్గొన్నట్లు సమాచారం. కెసిఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా వారికి పార్టీని విడిచి పెట్టే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకత్వం మారాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా చురుకైన నాయకుడిని ఎంపిక చేసుకుని కెసిఆర్ ను పెద్ద దిక్కుగా పెట్టుకోవాలనేది వారి అభిమతమని అంటున్నారు. పార్టీలో కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, కూతురు కవితల జోక్యం పెరిగిపోయిందని, దీనివల్లనే సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పార్టీలో చాలా మంది భావిస్తున్నారు. పొరపాట్లు జరిగాయని, వాటిని సమీక్షించి సరిదిద్దుకుంటామని కెసిఆర్ శుక్రవారం చెప్పారు. అయితే ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అనే అభిప్రాయం కూడా ఉంది. సమీక్షలు తూతూ మంత్రంగా సాగించడం కెసిఆర్ కు అలవాటేననే అభిప్రాయం కూడా ఉంది.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications