హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబ్బు లేకే దెబ్బై పోయాం: జెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు ఉండుంటే ఇటీవలి ఎన్నికల్లో తమ పార్టీ కీలకమయ్యేదని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయం లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో తమ పార్టీ వద్ద రూ.40 కోట్లు ఉండి ఉంటే ఈపాటికి తమ పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుండేదన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నిక ల్లో కీలకపాత్ర పోషించేందుకు ఇప్పటి నుండే సమాయత్తమవుతున్నట్లు చెప్పారు. నిధుల సేకరణ, సభ్యత్వ నమోదుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. తమ పార్టీకి విరాళాలివ్వాలని, సభ్యత్వా లు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇటీవలి ఎన్నికల్లో తమ పార్టీకి రూ. 3.23 కోట్లు విరాళాలు రాగా రూ.3.16 కోట్లు ఖర్చయిం దన్నారు. ఇందులో అధికభాగం అంటే రూ.2.25 కోట్లు ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో ప్రచారానికే వ్యయమైందన్నారు. నల్లడబ్బును విరాళంగా అం దుకోవటానికి తమ పార్టీ విరుద్ధమన్నారు. మూడు సంప్రదాయ పార్టీల ఎన్నికల ఖర్చు సుమారు రూ. 4 వేల కోట్లుంటుందని ఒకప్రశ్నకు బదులిచ్చారు.

2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే సంస్థాగతంగా, ఆర్థికపరంగా పార్టీని బలోపేతం చేసేందుకు తగిన వ్యూహాన్ని అమలు చేస్తామన్నా రు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పొత్తులపై ప్రశ్నించగా, తమ పార్టీ విధానాలు మెచ్చి తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తుల గురించి చర్చిస్తామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు తమకు అధికారం అప్పగిస్తే ఆరోగ్యప్రమాణాలతో కూడిన మంచినీరు అందిస్తామని, మురుగు కాల్వ ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X