‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అమలాపాల్.. 2009లో 'నీలతామర' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. తెలుగులో 'నాయక్', 'ఇద్దరు అమ్మాయిలతో' వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గ్లామర్ పాత్రలతోనే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ మెప్పించి దక్షిణాదిలో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే అమలాపాల్ తీసుకున్న కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పాయి.
మొదటి వివాహం.. విడాకులు
కెరీర్ పీక్ దశలో ఉన్న సమయంలోనే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలాపాల్ ప్రేమలో పడింది. వీరిద్దరూ 2014లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత ఆమె సినిమాలకు కాస్త దూరమైంది. అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కుటుంబ పరమైన విభేదాలు రావడంతో పెళ్లయిన మూడేళ్లకే అంటే 2017లో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం చాలా కాలం పాటు అమలాపాల్ ఒంటరిగానే తన జీవితాన్ని గడిపింది.

జగత్ దేశాయ్‌తో పరిచయం.. డేటింగ్
విడాకుల అనంతరం దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలపై దృష్టి పెట్టిన అమలాపాల్‌కు పారిశ్రామికవేత్త, సింగర్ జగత్ దేశాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. వీరిద్దరూ చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అయ్యేవి. అయితే ఎవరూ ఊహించని విధంగా అమలాపాల్ సడన్‌గా రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.
ప్రెగ్నెన్సీ, రెండో పెళ్లిపై బోల్డ్ కామెంట్స్
తన రెండో పెళ్లి గురించి గతంలో అమలాపాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. తన ప్రెగ్నెన్సీ గురించి ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడారు. "జగత్ దేశాయ్‌తో నా బంధం చాలా పారదర్శకమైనది. మేమిద్దరం కలిసి ఉన్న సమయంలో అనుకోకుండా నేను గర్భం దాల్చాను. ఆ ప్రెగ్నెన్సీ కారణంగానే మా పెళ్లి హడావిడిగా, అనుకోకుండా జరిగింది. సమాజం కోసం, ఆ పరిస్థితిని బట్టి బలవంతంగా నేను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది" అంటూ ఆమె అప్పట్లో బోల్డ్‌గా తన మనసులోని మాటను పంచుకున్నారు.
ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్
ప్రస్తుతం అమలాపాల్ తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అమలాపాల్‌కు ఓ కుమారుడు(ఇలాయ్) ఉన్నాడు. బాబు పుట్టినప్పటి నుంచి ఆమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చి పూర్తి సమయాన్ని బాబును చూసుకోవడానికే కేటాయిస్తున్నారు. తన కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలు, వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఇటీవల ఆమె నటించిన 'ది గోట్ లైఫ్' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.
-
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications