అభిషేక్ అంటే వాళ్లకు అసూయ ? బాంబు పేల్చిన సంజూ శాంసన్ ..!
టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను సూపర్ 8 నుంచి సెమీ పైనల్ కు, అక్కడి నుంచి ఫైనల్ కు, చివరిగా టైటిల్ అందుకునే వరకూ తీసుకెళ్లిన స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ (sanju samson).. తన సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ (abhishek sharma) ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న దశలో పూర్తి సహకారం అందించిన శాంసన్.. తాజాగా ఇండియా టుడ్ కాంక్లేవ్ లో తన టీమిండియా సహచరుడి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా ఓపెనింగ్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న సంజూ శాంసన్.. తమ ఇద్దరి కలయికను ఐస్ అండ్ ఫైర్ అంటుంటారని, కానీ తాము ఫైర్ అండ్ ఫైర్ జోడీ అని తేల్చేశాడు. ఇందుకు సహజమై కేరళ-పంజాబీ స్నేహాన్ని కారణంగా చూపాడు. అభిషేక్ ధైర్యం, ప్రశాంతతను ప్రశంసిస్తూ శాంసన్ అతన్ని ఆకాశానికెత్తేశాడు. మైదానంలో, బయట కూడా అతని స్నేహాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు శాంసన్ చెప్పుకొచ్చాడు. దీంతో పాటే మరో ట్విస్ట్ ఇచ్చాడు.

అభిషేక్ తొలినాళ్లలో స్టార్‌డమ్ కారణంగా భారత ఆటగాళ్ళు అతనిపై అసూయపడ్డారని శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గతంలో అభిషేక్ కు వస్తున్న చీర్స్ చూసి టీమిండియా సహచరులు అసూయపడేవారని శాంసన్ తెలిపాడు. అభిషేక్..అభిషేక్ అంటూ నినాదాలు చేసే వారని గుర్తుచేసుకున్నాడు. ఆ దశలో అభిమానులు అభిషేక్ ను మాత్రమే చూస్తారా లేక తమను కూడా చూస్తారా అని కూడా అనుకునే వాళ్లమని వెల్లడించాడు. అతను ఇప్పుడు జట్టులో సూపర్ స్టార్ అయ్యాడన్నారు. త్వరలో పెళ్లి చేసుకో, భాయ్ అంటూ తన సహచరుడు అభిషేక్ కు శాంసన్ సూచించాడు.












Click it and Unblock the Notifications