న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి అరుణ్ జైట్లీ మంగళవారం రాజీనామా చేశారు. పార్టీ నిబంధనలు అనుసరించి ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్న నియమానికి కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షునికి సమర్పించారు.
ఈ రాజీనామా పైకి సాంకేతికంగా కన్పించినా మనస్ధాపంతోనే ఆయన వైదొలిగారని అనిపిస్తోంది. జైట్లీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కారాదని నిర్ణయించుకోవడం గమనించాల్సిన విషయం.