హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమీక్షాసమావేశాలు జరపనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల అధ్యక్షులతోపాటు పీసీసీ సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరవుతారు. అనంతరం మహిళా, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యుఐ, సేవాదళ్ ల పనితీరును కూడా డీఎస్ సమీక్షిస్తున్నారు.