హైదరాబాద్: టీఅర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ని అంతం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆరోపణలకు ఆయన మాజీ సహచరుడు చంద్రశేఖర్ వ్యాఖ్యలే సమాధానాలన్నారు. అసలు తెలంగాణ ఉద్యమమే లేదని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాస విచ్ఛిన్నమైనప్పుడు తెలంగాణ భవన్ ను ప్రభుత్వానికి స్వాధీనం చేసేలా నిబంధన పెట్టాలని భూమి కేటాయించినపుడే మంత్రివర్గంలో సూచించినట్లు జేసీ తెలిపారు.