శిల్పా భూములపై విచారణ: కలెక్టర్
కర్నూలు: రాష్ట్ర మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి చెందిన శిల్పా టౌన్ షిప్ లోని అసైన్డ్ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. కర్నూలులోని శిల్పా టౌన్ షిప్ అధినేత మోహన్ రెడ్డి నుంచి సాయినాథ్ అనే వ్యక్తి కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళ్లారు. అది అసైన్డ్ భూమి కనుక రిజిస్ట్రేషన్ కుదరదనటంతో సాయినాథ్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
ఈ కేసు సంచలనం సృష్టించటంతో కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా విచారణకు ఆదేశించారు. శిల్పా మోహన్ రెడ్డి చక్రపాణి రెడ్డి పేరు మీద ఆ ఆసైన్డ్ భూములు ఉన్నట్లు సమాచారం. శిల్పా మోహన్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కొంత వరకు ఇరకాటంలో పడింది. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications