బస్సు, టిప్పిర్ ఢీ: ఏడుగురు మృతి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసి బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ పోలేపల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. మరణించినవారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక పాప ఉన్నారు.
మృతుల్లో ఆరుగురు బస్సు ప్రయాణికులున్నారు. మరో వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ప్రమాదంలో మరణించాడు. మరో పది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం నాగర్ కర్నూలు నుంచి ఆర్టీసి బస్సు బయలుదేరి జడ్చర్లకు చేరుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు నాగర్ కర్నూలుకు సమీపంలోని గ్రామాలవారని భావిస్తున్నారు. మరణించిన పాప నాగర్ కర్నూలులో కానిస్టేబులుగా పనిచేస్తున్న వ్యక్తి కూతురని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications