హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత హత్య
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అందరూ తిరిగే సమయంలోనే కొందరు దుండగులు ఓ కాంగ్రెస్ నేతను హత్య చేశారు. హైదరాబాదు సమీపంలోని కీసర మండలం దమ్మాయిగూడ గ్రామ మాజీ ఉప సర్పంచి జంగారెడ్డిని గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి కత్తులతో పొడిచారు. వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణం పోయినట్లు డాక్టర్లు నిర్థారించారు.












Click it and Unblock the Notifications