కెసిఅర్ బుర్రకు రూ. కోటి: టీజీ
కర్నూలు: తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ గొంతెత్తినప్పుడల్లా రాయలసీమ ప్రయోజనాల కోసం తామూ గళం విప్పుతామని కర్నూలు శాసనసభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కన్వీన ర్ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. సీమ హక్కుల కోసం అక్టోబర్ 2నుంచి రి లే నిరాహార దీక్ష చేపడతామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.
తెలంగాణవాదులు ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, పెద్దఎత్తున నిధులు తరలించుకెళ్తున్నారని పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవాలంటే తాము ఉద్యమించక తప్పదన్నారు. బడ్జెట్‌లో సీమ వాటా సాధనకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఅర్ బ్లాక్ మెయిలింగ్ తెలివితేటలతో కాస్త సహకరించాలని ఎద్దేవా చేశారు. అందుకు అంగీకరిస్తే ఆయన మేధస్సుకు రూ.కోటి ఖరీదు కడతామని చెప్పారు. నిధుల వరద పారించే ఆలోచన అందిస్తే సీమలో జో లెపట్టి అయినా, ఆయనకు ఈ మొత్తం ముట్టచెబుతామని చలోక్తి విసిరారు.












Click it and Unblock the Notifications