న్యూఢిల్లీ: ఆహార భద్రత కోసం చట్టం తేవాలని, ఆ రకంగా ఎన్నికల హామీని అమలు చేయాలని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. ఈ మేరకు సోనియా ప్రధానికి ఒక లేఖ రాశారు. సోనియా మన్మోహన్ కు ఈ విధమైన లేఖ రాయడం ఇదే మొదటిసారి.
ప్రధాని పరిశీలనకు ఆమె ముసాయిదా చట్టం ప్రతిని కూడా పంపారు. ఆహార హక్కు చట్టం పేర దానికి ఆమె రూపకల్పన చేశారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం సరిపోయినంత ఆగారం పౌరులకు అందే అవకాశం చట్టం కల్పిస్తుంది.