జాక్సన్ పొట్టలో మాత్రలే, తిండి లేదు
లండన్: పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ పొట్టలో మాత్రలు తప్ప ఆహార పదార్థాలు లేవని శవపరీక్షలో తేలినట్లు ద సన్ పత్రిక వెల్లడించింది. జాక్సన్ శరీరం ఎముకల గూడులా ఉందని ఆ పత్రిక రాసింది. తలపై వెంట్రుకలు లేవని, ఎముకలు విరిగి ఉన్నాయని తెలిపింది. తొడలకు, భుజాలకు సూదులు గుచ్చిన గుర్తులున్నాయని తెలిపింది. నార్కోటిక్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల శరీరానికి సూదులు గుచ్చిన గుర్తులున్నాయని అభిప్రాయపడింది.
జాక్సన్ రోజులో ఒక్కసారి మాత్రమే కొద్దిగా ఆహారం తీసుకున్నట్లు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ కు ముందు తీసుకున్న మాత్రల గుండె ఆగిపోయిందని అంటున్నారు. మరణించిన సమయంలో విగ్గు పెట్టుకుని ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications