కూలిన విమానం: 150 మంది గల్లంతు
మొరోనీ: యమెన్ విమానం హిందూ మహాసముద్రంపై ప్రయాణిస్తూ కుప్పకూలింది. కొమరస్ దీవుల్లో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రయాణిస్తున్న 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
విమాన ప్రయాణికుల్లో ఎవరైనా బతికి ఉన్నారా అనే విషయం తనకు తెలియదని కోమరోస్ ఉపాధ్యక్షుడు ఇది నాధోయిమ్ చెప్పారు. విమానం కూలిన స్థలమేదీ సరిగా తెలియదు. విమానం సముద్రంలో కూలిందని, సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కూడా లేదని కొమరోస్ పోలీసు వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications