భార్యాకూతుళ్లపై వ్యక్తి యాసిడ్ దాడి
గుంటూరు: గుంటూరు జిల్లాలో భార్య, కూతరుపై కుటుంబపెద్దే యాసిడ్ తో దాడికి దిగాడు. ఈ సంఘటన నరసరావుపేట మండలం ఎలమంద గ్రామంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
కుటుంబకలహాలే దాడికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. భార్య ఎలమందలోని పుట్టింటిలో ఉంటోంది. బుధవారంనాడు ఇక్కడికి వచ్చాడు. ఇంటికి రాకుండా పుట్టింటిలో ఉన్నందున అనుమానంతో అతను ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.












Click it and Unblock the Notifications