తలసానితో చంద్రబాబు రాజీ
హైదరాబాద్: అసమ్మతి రాగం వినిపిస్తోన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ షరతులకు ఆయన తలొగ్గినట్లు సమాచారం. అధినేత చంద్రబాబునాయుడుతో తలసాని గురువారం సమావేశమయ్యారు. తలసాని సామాజిక వర్గానికే చెందిన యనమల రామకృష్ణుడు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరి మధ్య దాదాపు రెండున్నర గంటల పాటు చర్చలు జరిగాయి.
పార్టీ పోలిట్‌బ్యూరోకు తమ సామాజిక వర్గం నుంచి తలసానికి అవకాశం ఇవ్వాల్సిందిగా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస యాదవ్ ను మేయర్ పదవికి అభ్యర్థిగా నిలబెట్టడానికి చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు సమాచారం. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని భేటీ అనంతరం శ్రీనివాస యాదవ్ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేయాలన్న తన వాదనను చంద్రబాబు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.రెండున్నర గంటల భేటీలో చాలా విషయాలు చర్చించామని, చాలా విషయాలు తాను అంగీకరించానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications