రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ను కలుపుతూ రెండు కొత్త రైళ్లను రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లను ప్రైవేట్ భాగస్యామ్యంతో అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు. అంతర్జాతీయ హోదా కింద పలు ప్రత్యేక సదుపాయాలు సమకూరనున్నాయి. శుభ్రతకు, సమయపాలనకు ఈ స్టేషన్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఎస్కలేటర్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ తో పాటు తిరుపతి రైల్వే స్టేషన్ కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. ఈ రెండు స్టేషన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి జరగనుంది. హైదరాబాద్ స్టేషన్లో బహుళ ప్రయోజనకర సముదాయం ఏర్పాటుకానుంది.
ఏపీని కలుపుతూ రెండు కొత్త రైళ్లు
- విశాఖ-ముంబయి సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్
- బిలాస్ పూర్-హైదరాబాద్-తిరునల్వేలి సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్
పొడగించిన రైళ్లు
- సికింద్రాబాద్-పాట్నా రోజు రైలు
- సికింద్రాబాద్-విశాఖ రోజు రైలు
మెదక్ నుంచి అక్కన్నపేట, విష్ణుపురం నుంచి వినుకొండల వరకు కొత్త రూట్ల సర్వే చేపట్టనున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు.












Click it and Unblock the Notifications