హైదరాబాద్: మమతా బెనర్జీ ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయడం లేదనేది రైల్వే బడ్జెట్ లో జరిగిన అన్యాయమే నిదర్శనమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లోకసభ సభ్యులున్నారని, వారు ప్రభుత్వానికి బోయీలుగా మాత్రమే పనికి వస్తున్నారు తప్ప రాష్ట్రానికి మేలు చర్యలకు పనికి రావడం లేదని ఆయన అన్నారు.
ప్రైవేట్ భాగస్వామ్యంతో రైల్వే రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. తిరుపతి రైల్వే స్టేషనును అంతర్జాతీయ స్థాయి హోదాకు అభివృద్ధి చేస్తామని చెప్పడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.