ప్రజా రైల్వై బడ్జెట్: మమత

రైల్వై బడ్జెట్ మమత దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని, కీలకమైన ప్రాజెక్టులకు వనరుల సమీకరణపై కూడా దృష్టి పెడతారని ఆమె సన్నిహిత వర్గాలంటున్నాయి. కాశ్మీర్ రైలు లింక్ ప్రాజెక్టుకు, ఫాస్ట్ ట్రాక్ పై ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టుకు ఆమె ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
రైల్వే ఎప్పుడు కూడా ప్రజల దృష్టి కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. రైల్వే చార్జీల్లో మార్పులు చేయవచ్చు. సూపర్ ఫాస్ట్ చార్జీలను తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు. మరింత మందిని ఆకర్షించేందుకు తత్కాల్ లో కొన్ని మార్పులకు కూడా అవకాశం ఉందని చెబుతున్నారు. మమత లోటు బడ్జెట్ ను ప్రతిపాదించకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications