చార్జీల పెంపు లేదు: మమత
న్యూఢిల్లీ: తన హామీని నిలబెట్టుకుంటూ రైల్వే మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రజానుకూల బడ్జెట్ ను ప్రతిపాదించారు. ప్రయాణ, సరుకు రవాణా చార్జీలను పెంచలేదు. తత్కాల్ టికెట్లను 150 రూపాయల నుంచి వంద రూపాయలకు తగ్గించారు. వంద కిలోమీటర్ల లోపు ప్రయాణించే నిరుపేదలకు 25 రూపాయలకే సీజన్ టికెట్లు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
విశాఖ-ముంబయి, బిలాస్ పూర్-హైదరాబాద్-తిరునల్వేలి మార్గాల్లోనే కాకుండా హౌరా-ముంబయి, చెన్నై-ఢిల్లీ, ఢిల్లీ-పూణై, ఢిల్లీ-గౌహతి, రాంచీ-పాట్నాల మధ్య నాన్ స్టాప్ రైళ్లను నడపనున్నట్లు ఆమె తెలిపారు.
ఆర్థిక మాంద్యాన్ని పట్టించుకోకుండా లక్ష్యాలను తగ్గించుకున్నట్లు ఆమె తెలిపారు. 2009లో కార్గో అభివృద్ధి రేటు 5 శాతం ఉంటుందని ఆమె చెప్పారు. గత మధ్యంతర బడ్జెట్ వాస్తవ అంచనాలను ప్రతిఫలించలేదని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications