టిడిపి ఆఫీసు ఎదుట లోక్ సత్తా ధర్నా
హైదరాబాద్: కాంగ్రెస్ డబ్బుతో లోక్‌సత్తా ఎన్నికల్లో పాల్గొందన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. బాబు వ్యాఖ్యలకు నిరసనగా ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్ వద్ద లోక్‌సత్తా కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇందుకు ప్రతిగా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు లోక్‌సత్తా అధినేత జేపీకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సత్తా ఊంటే జెపి మళ్ళీ కుకట్ పల్లి నుంచి పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. "మీరు విరాళాలు ఎలా సేకరిస్తారో వెల్లడించండి, మా ఆడిట్ వివరాలను మీకు తెలియజేస్తాం" అని లోక్ సత్తా నాయకులు అన్నారు.












Click it and Unblock the Notifications