జర్దారీకి సరబ్ జిత్ మరో మెర్సీ పిటిషన్
ఇస్లామాబాద్: ఉరిశిక్ష పడిన భారత ఖైదీ సరబ్ జిత్ న్యాయవాది పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి మరో క్షమాభిక్ష పిటిషన్ సమర్పించనున్నారు. ఈ క్షమాభిక్ష పిటిషన్ ను బుధవారం సమర్పిస్తానని సరబ్ జిత్ తరఫు కొత్త న్యాయవాది ఓవైస్ షేక్ సోమవారం చెప్పారు. జర్దారీతో భేటీకి కూడా తాను విజ్జప్తి చేశానని, దాని వల్ల వ్యక్తిగతంగా అన్ని విషయాలు చెప్పడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
సరబ్ జిత్ రాసిన లేఖను క్షమాభిక్ష పిటిషన్ కు జత చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన సోమవారం సరబ్ జిత్ ను జైల్లో కలుసుకున్నారు. జైలులో ఇప్పటికే 19 ఏళ్లు గడిపానని సరబ్ జిత్ తన లేఖలో తెలిపాడు.












Click it and Unblock the Notifications