తలసానిపై చంద్రబాబు సీరియస్

సమైక్యవాదాన్ని అందుకుని తెలుగుదేశం తెలంగాణ అనుకూల వైఖరిని ప్రశ్నించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబుతో భేటీ అయి రాజీకి వచ్చినట్లే కనిపించారు. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుతో చర్చించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో ఉంటానని చెప్పారు. మాటకు కట్టుబడకుండా మళ్లీ కాంగ్రెసు వైపు తలసాని చూస్తుండడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు.
కాగా, ముఖ్యమంత్రితో భేటీపై మాట్లాడడానికి తలసాని శ్రీనివాస యాదవ్ సిద్ధంగా లేరు. ఆయన మీడియాకు ముఖం చాటేస్తున్నారు. కాంగ్రెసులో చేరిపోవడానికే ఆయన సిద్ధపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications