మమతతో ఎంపీల మొక్కుబడి భేటీ

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను కలవడానికి రైల్వే మంత్రి మమతా బెనర్జీ మంగళవారం తొలుత నిరాకరించారు. రైల్వే బడ్జెట్ లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వెళ్లిన వారికి ఆమె వద్ద చుక్కెదురైంది. సోమవారంనాడు ఎందుకు రాలేదని ఆమె కాంగ్రెస్ ఎంపీలను అడిగారు. చివరకు మొక్కుబడిగా వారు మమతా బెనర్జీకి రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై వినతిపత్రం సమర్పించారు. ఇదిలా ఉంటే, కాంగ్రెసు ఎంపీల కన్వీనర్ గా పొన్నం ప్రభాకర్ ఎన్నికయ్యారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications