ఒంగోలు: హోం శాఖను రెండు గంటలు నాకు ఇస్తే అక్రమ నిల్వలన్నీ బయిటపెడతానంటున్నారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ . ఆయన ప్రకాశం జిల్లా టంగుటూరులోని శ్రామికనగర్ వాసులనుపరామర్శించారు. ఈ సందర్భాంగా మీడియాతో మాట్లాడుతూ అక్రమ నిల్వల వల్ల ధరలు పెరుగుతున్నాయన్నారు. ప్రభత్వం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెట్టే విధానాన్ని అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఆలయ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేసిన సర్కారు అదేస్థలంలో పెద్దలు నిర్మించుకున్న భవనాలను ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం నిరుపేదలను రోడ్డుకీడ్చడం ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శమని అన్నారు. శ్రామిక నగర్‌లో గుడిసెలు కోల్పోయిన వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించి సహాయం చేయాలని డిమాండ్ చేశారు.