మరిన్ని కేంద్ర నిధులు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వచ్చే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కోరారు. వచ్చే ఐదేళ్లలో 46 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 13వ ఆర్థిక సంఘంతో ఆయన సోమవారం ఉదయం హైదరాబాదులోని జూబ్లీ హాల్ లో సమావేశమయ్యారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం వల్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలకు నిధుల సమస్య ఎదురవుతోందని, ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగించిందని, ఈ స్థితిలో కేంద్ర సాయం మరింత అవసరమని ఆయన అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక గ్రాంట్లు ఏర్పాటు చేయాలని, ఉచిత విద్యుత్ కు కేంద్ర సాయం అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సామాజిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని, ఉదాహరణకు నక్సల్స్ సమస్య పరిష్కారం ఆర్థికాభివృద్ధితోనే ముడబడి ఉందని ఆయన అన్నారు. ప్రణాళికా వ్యయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 30.5 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+