విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది. అది క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాలో, ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావం వచ్చే 24 గంటల పాటు ఉంటుందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వారు చెప్పారు.