చిరు పార్టీతో పొత్తు ఉండదు: టిడీపి
హైదరబాద్: ప్రజారాజ్యం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని టీడీపీ స్పష్టం చేసింది. బుధవారం ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పీఆర్పీతో పొత్తు ఉండే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టంగా చెప్పామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై వైఎస్ ప్రభుత్వం శ్వేత ప్రతం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా పార్క్ లను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే నని ఎర్రన్నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications