గ్రేటర్ పోరులో ఎవరి దారి వారిదే

లోక్‌సత్తా పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న యోచన ప్రజారాజ్యంలో ఉంది. ఈ దిశగా ఆ పార్టీ ఇప్పటికే కొన్ని సంకేతాలను లోక్‌సత్తా నాయకత్వానికి పంపింది. కానీ లోక్‌సత్తా పార్టీ ఈ ప్రతిపాదనలకు అంత సుముఖంగా లేదు. తమ ఎజెండాను అంగీకరించే పార్టీలతోనే కలుస్తామని లోక్ సత్తా చెప్పింది. అయితే దాన్ని అంగీకరించేందుకు ప్రజారాజ్యం సిద్ధంగా లేదు. బీజేపీతో కలిసి పోటీచేద్దామని కొందరు నగర నేతలు పీఆర్పీ అధినేత చిరంజీవికి సూచించారు. బీజేపీ కూడా ఇందుకు ఆసక్తిగానే ఉంది. కానీ ఆ ప్రతిపాదనను చిరంజీవి తోసిపుచ్చారు. దీనివల్ల లౌకికవాద ముద్రను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగే సూచనలే అధికంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీఆర్‌ఎస్ ఈసారి ఒంటరిగా పోటీచేయనుంది.
తెరాస పార్టీతో కలవడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నా టీఆర్‌ఎస్ అధినాయకత్వం మాత్రం దానికి సుముఖంగా లేదు. అలా కలిస్తే మైనారిటీలు శాశ్వతంగా దూరం అవుతారన్నది ఆ పార్టీ భయం. అధికార కాంగ్రెస్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోలాగే మజ్లిస్‌తో అనధికారిక పొత్తు కొనసాగించనుంది. మజ్లిస్ పోటీచేసే స్థానాల్లో ఆ పార్టీ నామమాత్రపు అభ్యర్థులను బరిలోకి దించనుంది. అధికారికంగా అన్ని చోట్లా పోటీలో ఉన్నట్లు కనిపించినా, అనధికారికంగా పాత బస్తీలో మజ్లిస్‌కు సహకరిస్తుంది. దీనికి ప్రతిగా ఇతర డివిజన్లలో మైనారిటీల ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా మజ్లిస్ కృషి చేస్తుంది.












Click it and Unblock the Notifications