సాయిరాంకు ఉస్మాయాలో మెడికల్ సీటు
హైదరాబాద్: ఎంసెట్ తొమ్మిదో ర్యాంకర్ సాయిరాం ఎట్టకేలకు మెడికల్ సీటు సంపాదించాడు. అతనికి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు కేటాయించారు. బిసి కోటా కింద అతను సీటు తీసుకున్నాడు. వయోపరిమితి సరిపోలేదని అంటూ కౌన్సెలింగులో తొలుత అతనికి మెడికల్ సీటు కేటాయించడానికి అధికారులు నిరాకరించారు. అయితే హైకోర్టు జోక్యంతో అతనికి అధికారులు సీటు కేటాయించారు.
భారత వైద్య మండలి (ఎంసిఐ) నిబంధనల ప్రకారం ఎంబిబియస్ కోర్సులో చేరడానికి విద్యార్థికి 17 ఏళ్లు దాటి ఉండాలి. సాయిరాంకు 17 ఏళ్లకు 15 రోజులు తక్కువగా ఉన్నాయంటూ సోమవారం సీటు నిరాకరించారు. వయోపరిమితిని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా వారు ఖాతరు చేయలేదు. దీంతో సాయిరాం హైకోర్టును ఆశ్రయించాడు. వయస్సును మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అంటూ కోర్టు సాయిరాంను కౌన్సెలింగుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది. అయితే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అధికారులు సాయిరాంకు సీటు కేటాయించారు.












Click it and Unblock the Notifications