సూరి విడుదలకు సిధ్దం?
హైదరాబాద్: జీవిత ఖైదీల విముక్తి కోసం ప్రభుత్వం కొత్తగా జారీచేసిన ఉత్తర్వుల కారణంగా మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి విముక్తికి రంగం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ కారుబాంబు కేసులో సూరి జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఇక ఆయనతోపాటు మావోయిస్టు ఖైదీలూ విడుదల కానున్నారు. అయితే పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సూరి రిమాండు ఖైదీగా ఉన్నందున వెంటనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశంలేదని కొందరు న్యాయనిపుణులు అంటున్నారు. అయితే ఈ కేసులో బెయిలు లభించినా, నిర్దోషిగా తేలినా ఆయన బయటకు వస్తారు. అప్పటిదాకా జైలులోనే ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఈ కేసులో సూరి, పవన్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. వారు విముక్తి పొందుతారు. అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే వ్యవహారం రెండేళ్లుగా నలుగుతోంది. తమ అనుయాయులను విడిపించుకునేందుకే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీచేసిందని కొందరు పిటిషన్ దాఖలుచేయగా మొదట సుప్రీంకోర్టు మొత్తం ప్రక్రియను నిలిపివేసింది. ఆ తర్వాత ఖైదీల విడుదలకు సుప్రీంఒప్పుకుంది. ఈ మేరకు గత జనవరిలోనే విడుదలయ్యే ఖైదీల జాబితాను సిద్ధంచేసినా వివిధ కారణాలవల్ల ఆపుతూ వచ్చారు. తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.












Click it and Unblock the Notifications