బాబు మైండ్ సెట్ మారలేదు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఓడిన శాసనసభ్యుల పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు శాసనసభ్యులకు సూచించారు. సోమవారం సాయంత్రం జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో 50 మంది శాసనసభ్యులకు టికెట్లు మార్చాల్సి వచ్చిందని, టికెట్లు వచ్చిన 130 మంది శాసనసభ్యుల్లో 50 మంది ఓడిపోయారని, మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడం కష్టంగానే ఉంటుందని, ఆ తర్వాత సులువుగానే ఉంటుందని, అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓడారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

విశ్వసనీయత పెంచుకుంటే 2014 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుస్తామని, ఇప్పటి కన్నా రెండు మూడు రెండు మూడు ఎంపీ సీట్లు ఎక్కువే వస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మైండ్ సెట్ మారలేదని, ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా ప్రజలే తప్పు చేశారనే భావనలో ఉన్నారని ఆయన అన్నాిరు. చంద్రబాబు ప్రతివిషయాన్ని రాజకీయ లబ్దికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+