ఇండియాలో టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోలు వీళ్లే.. మారిన లెక్కలు..!

ఇండియాలో టాప్ హీరోల లిస్టు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ ఏడాది స్టార్ హీరోల సినిమా రిలీజ్, కలెక్షన్లు, ఇతర అంశాలను ఆధారంగా తీసుకుని ఓర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు ఇండియాలో టాప్ 10 హీరోల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ నెలలో ఈ లిస్టులో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ లిస్టులో ప్రభాస్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ సక్సెస్ తో ముందుకు దూసుకొచ్చాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాప్ 10 లోకి దూసుకువచ్చాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాప్ 10 లో లేకపోవడం గమనార్హం.

ఓర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ తాజా రిపోర్టు ప్రకారం ఎప్పటిలాగే ఈ సారి కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆయనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. చాలా ఏళ్లుగా ఆయన మొదటి స్థానంలోనే కొనసాగుతుండటం విశేషం. ప్రస్తుతం మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన తర్వాత ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో ప్లేస్ లో తమిళనాడు సీఎం, దళపతి విజయ్ ఉండటం విశేషం. మే నెలలో వచ్చిన రిపోర్టులోనూ వీరి స్థానాల్లో మార్పు లేదు.

మరోవైపు నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. గతంలో రెండో స్థానంలో, మూడో స్థానంలో ఉన్న బన్నీ గత నెలలో వెనుకబడ్డారు. ప్రస్తుతం ఆయన నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ విజయంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి దూసుకొచ్చారు. ఆరో స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్నారు.

Prabhas Shah Rukh Khan Vijay and Allu Arjun are among the top heroes on the list top 10 heroes

ఏడో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఉన్నారు. ఆయన ఇటీవల కరుప్పు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దాంతో ఎప్పుడూ లేని విధంగా టాప్ 10 లోకి దూసుకొచ్చారు సూర్య. ఇక ఈ లిస్టులో ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు. అలాగే తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు. ఇక చివరగా పదో స్థానంలో రణ్ వీర్ సింగ్ ఉన్నారు. అయితే ఈ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం షాకింగ్ అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+