ఉదయం నాలుగు గింజలు తీసుకోండి- బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్.. గుండె సేఫ్..!!
నట్స్ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఎన్నో పోషకాలు అందిస్తాయి. వాటిల్లో గుమ్మడి గింజలకు ప్రత్యేకత ఉంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతాయి. వీటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలు మొక్క ఆధారిత ప్రోటీన్ ను అందిస్తాయి. వెన్నెముక బలంగా తయారవ్వడంతో పాటు కండరాల మరమ్మత్తు కూడా సక్రమంగా జరుగుతుంది. అయితే వీటిని ఎలా తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యాన్ని పంచేవి గుమ్మడికాయ గింజలు. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పోషకాలను ఇచ్చే మంచి ఆహారం. ఇక గుమ్మడి గింజలను నేరుగా స్నాక్స్ గా తినవచ్చు. సలాడ్లలో కూడా వీటిని కలుపుకొని తీసుకోవచ్చు. ఇక సూప్ లలో కూడా గుమ్మడి గింజలు వేసుకొని తినవచ్చు. స్మూతీస్ లో కూడా గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. గుమ్మడి గింజలను రోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గుమ్మడి గింజలలో సంవృద్దిగా ఉండే పోషకాలు ఇవే గుమ్మడి గింజలలో మోనో అన్ శాచ్యురేటెడ్, పాలి అన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ బి కాంప్లెక్స్ గుమ్మడి గింజలలో లభిస్తాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, కాపర్ వంటి ఖనిజాలు గుమ్మడి గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లను ఈ గుమ్మడి గింజలు అందిస్తాయి.

నిపుణుల సూచనలు.. పరిమితి
గుమ్మడి గింజలను నిత్యం పరిమితంగా తీసుకోవటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్, మెగ్నీషియం మెదడు ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మంచి నిద్రకు ఉపకరిస్తుంది. గుమ్మడి గింజలు ఎక్కువ సేపు మన ఆకలిని తీర్చడానికి దోహదం చేస్తాయి. మన బరువును నియంత్రించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ కొవ్వులు కీళ్లను దృఢంగా చేయడంతో పాటు వాపు, నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. కనుక నడుము నొప్పితో బాధపడే వారు ఈ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు మాత్రం వీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications