కరీంనగర్: భార్య గొంతు కోసిన భర్త ఉదంతం కరీంనగర్ జిల్లాలో జరిగింది. భార్య పాలిట భర్తనే కాలయముడు కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దాడిలో భార్య మరణించింది. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొలనూరులో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఈ సంఘటన చేసుకున్నట్లు చెబుతున్నారు. భార్య గొంతు కోసిన అనంతరం భర్త పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.