నివేదికల మేరకే భద్రత: సబిత

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు భద్రత కుదిస్తున్నారని తెలుగుదేశం సభ్యులు అంతకు ముందు ఆరోపించారు. ప్రభుత్వం భద్రత కల్పించే విషయంలో పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లే నాయకులకు ప్రభుత్వం భద్రత కుదిస్తోందని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకు భద్రత కుదించిన మర్నాడే తనపై దాడి జరిగిందని ఆయన గుర్తు చేశారు. తనపై దాడి చేసినవారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు కల్పించిన భద్రతపై చర్చను ఇప్పుడు వాయిదా వేసి మరోసారి చర్చకు అనుమతించాలని తెలుగుదేశం సభ్యులు కోరారు. భద్రత పొందుతున్న నాయకుల వివరాలు వెల్లడించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. హోంమంత్రి ఇచ్చిన వివరణ అసమగ్రంగా ఉందని తెలుగుదేశం నిరసన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications