విజయవాడ: న్యూస్ రీడర్ లక్ష్మీ సుజాత హత్య కేసులో విజయవాడ కోర్టు మంగళవారం ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించింది. వారికి జరిమానా కూడా విధించింది. చంద్రశేఖర్, రవీంద్ర అనే ఇద్దరికి విజయవాడ కోర్టు జీవిత ఖైదు వేస్తూ విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. హత్యానంతరం నగలు దోచుకెళ్లినందుకు మరో మూడేళ్ల కారాగార శిక్ష కూడా విధించింది. లక్ష్మీసుజాత హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.విజయవాడలోని ఓ లాడ్జిలో 2007 ఫిబ్రవరి 9వ తేదీన లక్ష్మీసుజాత హత్యకు గురైంది.