భారీ వర్షంతో హైదరాబాద్ జలమయం

ఖైరతాబాద్, లక్డికా పూల్, మెహదీపట్నం, పంజాగుట్ట, మలక్ పేట, దిల్ షుక్ నగర్, టోలీ చౌక్, బేగంపేట, కింగ్ కోఠీ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగర శివారు ప్రాంతాలైన శివరాంపల్లి శివాజీనగర్, అత్తాపూర్ ల్లో ఇళ్లలోకి నీరు చేరింది.రాజేంద్ర నగర్ పరిధిలోని మణికొండలో పిరంగోని నాలా పొంగిపొర్లుతోంది. కార్యాలయాలకు, విద్యాసంస్థలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. గుంటూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో కూడా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది.












Click it and Unblock the Notifications