తిరుమలలో డొంక: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతి డొంక తిరుమలలో ఉందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. తీగ లాగితే డొంకంతా కదులుతుందని ఆయన అన్నారు. కోదండ రామస్వామి ఆలయంలోని నగలను పూజారి తాకట్టు పెట్టిన సంఘటనపై ఆయన బుధవారం శాసనసభలో మాట్లాడారు. కోదండ రామస్వామి ఆలయంలోనే కాకుండా ఇంకా అవినీతి ఉందని, గతంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.

అవినీతి కోదండరామస్వామి ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదని, తిరుమల దేవస్థానాలన్నింటిలోనూ ఉందని ప్రతపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి ప్రాముఖ్యం దెబ్బ తింటే చాలా ప్రమాదమని, అలా జరగకుండా చూడడం అవసరమని ఆయన అన్నారు. భక్తుల విశ్వాసాలు దెబ్బ తింటే మంచిది కాదని ఆయన అన్నారు. ఈ అంశంపై శాసనసభలో మరోసారి చర్చకు దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అంగీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో విభేదాలు లేవని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+