అమెరికాలో ఆంధ్ర విద్యార్థి మృతి

నిన్న ఉదయం ఐదున్నర గంటలో ప్రాంతంలో పిల్లిని రక్షించే ప్రయత్నంలో నరేష్ తన కారును చెట్టుకు ఢీకొట్టినట్లు తానా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ తోటకూర చెప్పారు. ఈ విషయాన్ని తాము అతని తల్లిదండ్రులకు తెలిపామని, మృతదేహాన్ని హైదరాబాదుకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.
నరేష్ నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో గల అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో నరేష్ బిటెక్ పూర్తి చేశాడు. ఈ ఏడాది జనవరిలో రైట్ స్టేట్ యూనివర్శిటీలో చేరాడు. నరేష్ తల్లిదండ్రులు, సోదరుడు హైదరాబాదులో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications