అటవీ ప్రాంతంలో వైయస్ 'భద్రం'

అటవీ ప్రాంతం కావడంతో, నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండడంతో అధికారులు ముఖ్యమంత్రి దిగిన స్థలాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో, గమనదిశ తెలియకపోవడంతో ముఖ్యమంత్రి హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చిత్తూరులోని స్థానిక శాసనసభ్యుడు సికె బాబు ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత పది గంటల 45 నిమిషాలకు చిత్తూరు జిల్లా అనుపల్లి గ్రామంలో ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. హెలికాప్టర్ దారి తప్పడంతో ఆయన నిర్థీత సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు.
ముఖ్యమంత్రి దిగిన ప్రాంతానికి కాంగ్రెసు నాయకుడు ఎస్పీవై రెడ్డి కారులో కర్నూలు నుంచి బయలుదేరారు. కర్నూలు జిల్లా ఉన్నతాధికారులు కూడా అక్కడికి బయలుదేరినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ భూభాగానికి చాలా దగ్గర ఉన్న విషయాన్ని తొలుత గొర్రెల కాపరులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయన తన చిత్తూరు పర్యటనను రద్దు చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన నేరుగా అక్కడి నుంచి హైదరాబాదుకు చేరుకునే అవకాశం ఉంది. దాదాపు నాలుగు గంటల పాటు ముఖ్యమంత్రి జాడ తెలియలేదు. అయితే ముఖ్యమంత్రి జాడకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రం లభించడం లేదు. నిజానికి ఆయన హెలికాప్టర్ ఎక్కడ దిగిందనే విషయాన్ని కూడా కచ్చితంగా చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications